calender_icon.png 30 August, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పునరావాస కేంద్రాలను సందర్శించిన ఎస్పీ రాజేష్ చంద్ర

29-08-2025 11:44:35 PM

అధైర్య పడకండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతులాకుతులమవుతున్న మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాల గ్రామాలకు వరద తీవ్రమైంది. ఈ నేపథ్యంలో వరద బాదితులకు ప్రభుత్వం మద్నూర్, డోంగ్లి, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం సందర్శించి బాదితులకు ధైర్యాన్ని నింపారు. వరదల మూలంగా ఎలాంటి నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు కూడా అధైర్య పడవద్దని తెలిపారు.