calender_icon.png 30 August, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షం తగ్గినా తేరుకోని జనజీవనం

30-08-2025 12:34:41 AM

-  ఇంకా పలు గ్రామాలకు రాకపోకలు బంద్

- బురదతో నిండిన దూప్సింగ్ తండా

- లోతట్టు ప్రాంతాలను, పునరుద్దరణ పనుల పర్యవేక్షణ

మెదక్, ఆగస్టు 29(విజయక్రాంతి):జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని అతలాకుతలమైంది. శుక్రవారం వర్షం తగ్గుముఖం పట్టినా చెరువులు, వాగులు, నదు లు ఇంకా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నా యి. జలదిగ్బంధంలో చిక్కుకున్న దూప్సింగ్ తండాలో వరద ఉధృతి తగ్గినప్పటికీ తం డాకు వెళ్ళలేని దుస్థితి నెలకొంది. ఇండ్లలో, వీధుల్లో బురదతో నిండిపోయింది. దీంతో తండావాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అధికారులు సైతం ఇప్పటి వరకు వారికి ఎలాంటి సహాయ సహకారాలు అం దించడం లేదు. ఏడుపాయల వనదుర్గామా త ఆలయం పూర్తిగా వరదలోనే ఉంది. అ లాగే వరద ప్రవాహం వల్ల గ్రామాలకు వెళ్ళే రోడ్లు తెగిపోయాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. అధి కారులు పునరుద్దరణ పనులు చేపడుతున్నారు. ప్రధానంగా రామాయంపేట మండ లం పర్వతాపూర్ రోడ్డు తెగిపోవడంతో ఇ బ్బందులు ఏర్పడుతున్నాయి. హవేళీ ఘణపూర్ మండలం పోచమ్మరాల్ రోడ్డుతో పా టు కోంటూర్ చెరువు అలుగు పారుతుండడంతో 8 గ్రామాలకు రాకపోకలు లేకుండా పోయాయి. నిజాంపేట మండలం హైదర్ చెరువు గట్టు తెగిపోవడంతో పంట పొలాలు నీటమునిగాయి. 

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్...

మంజీరా నది, పోచారం ప్రాజెక్టు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సర్ధన గ్రామ లోతట్టు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రా హుల్రాజ్ పరిశీలించారు. ముందస్తుగా ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. బూర్గుపల్లి గ్రామంలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ప్రాం తాన్ని తక్షణ మరమ్మతులు చేపట్టే పనులను పరిశీలించారు. అలాగే పలు గ్రామాల్లో రక్ష ణ చర్యలను జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కష్టకాలంలో ప్రజలకు అం డగా నిలిచే బాధ్యతను పోలీసులు సమర్థవంతంగా నిర్వర్తించారని, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆ ర్‌ఎఫ్, పోలీస్ బృందాలు సమన్వయంతో పని చేసి అనేక ప్రాణాలను రక్షించారని తెలిపారు. 

సిద్దిపేటలో కాలనీల మునకకు కారకులెవరు.?

సిద్దిపేట, ఆగస్టు 29 (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలో పలు కాలనీలు వరద నీటికి మునిగిపోయాయి. అధునాతన నిర్మాణాలు సైతం వరద బీభత్సానికి మునగక తప్పలేదు. కాలనీలా మునుకకు కారకులు ఎవరు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోమటి చెరువు ప్రధాన కేనాల్ ఆనుకొని ఉ న్న శ్రీనగర్ కాలనీ, హరిప్రియ నగర్, శ్రీనివాస్ నగర్ కాలనీలు రెండు రోజులు కురిసి న భారీ వర్షానికి పూర్తిగా జలమయమయ్యాయి. నీట మునిగిన కాలనీలన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన వెంచర్లే మరి వెం చర్ ద్వారా కొనుగోలు చేసిన యజమానులు గృహ నిర్మాణ నిబంధనలు పాటిం చకపోవడం లేక వెంచర్లుగా ఏర్పాటు చేసిన వ్యాపారుల లోపమా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కోమటి చెరువు కింది భాగంలో ఉన్న ఈ కాలనీలన్నింటికీ అధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినప్పుడు నిబంధ నలు అమలు చేయకపోవడమే ప్రధాన కారణాలుగా చర్చ జరుగుతుంది. 

- కెనాల్ పూడిక తీయక ఎన్నేళ్లు..

కోమటి చెరువు ప్రధాన కెనాలు చాలా ఏళ్లుగా పూడిక తీయకపోవడం వల్ల వరద నీరు కెనాల్ బయట నుంచి ప్రవహించాయ ని స్థానికులు అంటున్నారు. కెనాల్ లో పూ డిక తీయకపోవడం వల్లనే తుంగ వంటి గడ్డి అధికమవడంతో వరదకు వచ్చిన చెత్త చెదారం నిండిపోవడం వల్ల కెనాల్ లో నీటిమట్టం పెరిగిందనీ, దాంతో వరద నీరు అధికమవడంతో కెనాల్ సమీపంలోని కాలనీలన్నీ జలమయమయ్యాయని స్థానికులు అంటున్నారు. కోమటి చెరువు నిర్వాహకులు, సంబంధిత అధికారులు కెనాలను సందర్శించిన దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కెనాలు కు నిర్మించిన సీసీ వాల్ పలుచోట్ల ధ్వంసమైనప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. కెనాల్ వెంట ఉన్న నివాసదారులందరూ వారి ఇళ్లల్లోని వ్యర్ధాలను, ప్లాస్టిక్ కవర్లను ఈ కెనాల్ లో వేయడం కూడా ఒక కారణమే అయితే ఇంటింటా చెత్త సేకరణ చేసినప్పటికీ కొంతమంది చెత్త సేకరణకు వాహనం వచ్చినప్పు డు ఇంట్లో లేకపోవడం వల్ల వారి ఇంట్లోని వ్యర్ధాలను ప్లాస్టిక్ కవర్లలో నింపి కెనాల్ లో పడవేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

కెనాల్ సమీపంలోని నివాసాలకు దుర్గంధం వెదజల్లుతుందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోలేదని మండిపడుతున్నారు. కెనాలుకు ఇరువైపులా చెత్త వేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన స్పందించలేదని అసలు మున్సిపల్ అధికారులు ఉన్నట్టా లేనట్టా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెనాల్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లనే వరద నీటితో త్వరగానే నిండి నివాసాల్లోకి నీరు చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నర్సాపూర్ చెరువు ఎఫ్ టి ఎల్ పూర్తిగా ఆక్రమ ణకు గురయితే అధికారులు స్పందించలేదని వారికి రావాల్సిన ముడుపులు అంద డం వల్ల విచ్చలవిడిగా అనుమతులు జారీ చేస్తున్నారని మండిపడుతున్నారు. 

శ్రీనివాస్ నగర్ లో నిర్మించిన భవనాలన్నీ నర్సాపూర్ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటాయని ఇదివరకే అధికారులు సర్వే ద్వారా వెల్లడించినప్పటికీ కొంతమందికి నోటీసులు ఇచ్చి మున్సిపల్ అధికారు లు జేబులు నింపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.