calender_icon.png 30 August, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల పేపర్స్ ఇష్టారాజ్యం..!

30-08-2025 12:32:59 AM

- కంపెనీ బూడిదతో పటేల్ చెరువు కలుషితం

- నీరు తాగిన పశువులకు రోగాలు

- దెబ్బతింటున్న పంట పొలాలు

- నిద్రావస్థలో పీసీబీ, ఇరిగేషన్ అధికారులు

గుమ్మడిదల, ఆగస్టు 29 :పరిశ్రమ యా జమాన్యం స్వార్థానికి ప్రకృతితో పాటు ప్రజల ఆరోగ్యం, రైతుల వ్యవసాయ పొలా లు తీవ్రస్థాయిలో నష్టపోతున్నాయి. గ్రా మీణ ప్రాంతాల్లో, జనావాసాల్లో పరిశ్రమ ను నెలకొల్పాలంటే అన్ని నిబంధనల ప్రకా రం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా కాలుష్యరహిత పరిశ్రమలను మాత్రమే నెలకొల్పాలి. కానీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేనితనంతో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా రు.

గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలోని తిరుమల పేపర్ పరిశ్రమ వెదజల్లుతున్న బూడిద వల్ల అటు ప్రజల ఆ రోగ్యంతో పాటు, ఇటు పంట పొలాలు కలుషితమవుతున్నాయి. దీనికి తోడు పరిశ్రమ వెదజల్లే బూడిద వర్షం పడినప్పుడల్లా నీటి లో కలిసిపోయి గ్రామానికి చెందిన పటేల్ చెరువు కలుషితమవుతుంది. దీంతో పశువులకు, పంట పొలాలకు బూడిద వల్ల నష్టపో తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. 

కలుషితమవుతున్న పటేల్ చెరువు...

మంబాపూర్ గ్రామంలో సుమారు 30 ఎకరాల్లో విస్తరించిన పటేల్ చెరువు ప్రధాన నీటి వనరుగా ఉంది. ఈ చెరువు కింద సు మారు 50 ఎకరాల ఆయకట్టు సాగవుతుం ది. తిరుమల పేపర్ పరిశ్రమ నుండి వెదజల్లుతున్న బూడిద వర్షం పడినప్పుడు, ఇతర సమయాల్లో నాలా ద్వారా పటేల్చెరువులో కలుస్తోంది. దీంతో నీరంతా నలుపుగా మారి విషపూరితంగా తయారవుతుందని చెబుతున్నారు. ఈ నీటిని తాగిన పశువులు సైతం అ నారోగ్యానికి గురవుతున్నట్లు చెప్పారు.

అలాగే ఈ నీటి ద్వారా సాగవుతున్న పంట లు సైతం ఎండిపోవడమే కాకుండా దిగుబ డి రాకుండా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పరిశ్ర మకు పటేల్ చెరువుకు మధ్య సుమారు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ ఐదెక రాల వ్యవసాయ భూమిలో పంటలు నష్టపోతున్నాయని సదరు రైతులకు ఏడాదికి కొంత నష్టపరిహారాన్ని కంపెనీ యాజమాన్యం చెల్లిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ వ ల్ల పంట పొలాలకు హానికరమైన బూడిద వల్ల నష్ట జరుగుతుందని తెలిసి కూడా మొండి వైఖరి అవలంభించడం శోచనీయమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

స్పందించని ఇరిగేషన్, పీసీబీ అధికారులు

గ్రామానికి చెందిన పటేల్ చెరువులో తి రుమల పేపర్స్ కంపెనీకి చెందిన హానికరమైన బూడిద కలిసి నీరంతా కలుషితమవు తున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు చ ర్యలు తీసుకోక పోవడం గమనార్హం. అలాగే కంపెనీ కాలుష్యకారక బూడిద ఇష్టారీతిగా వెదజల్లుతున్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు నిద్రావస్థలో ఉండడం శోచనీయమని విమర్శిస్తున్నారు. పలుమార్లు పీసీ బీ అధికారులకు గ్రామస్తులు, రైతులు ఫిర్యా దు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కం పెనీ ఇచ్చే మామూళ్ళ మత్తులో ఇరిగేషన్, పీసీబీ అధికారులు నిమ్మకుండి పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా మం డల ఇరిగేషన్ ఏఈ ప్రసాద్, తిరుమల పేప ర్స్ కంపెనీ హెచ్‌ఆర్ను విజయక్రాంతి వివరణ కోసం ప్రయత్నించగా వారు అందు బాటులోకి రాలేదు.