30-08-2025 12:33:27 AM
ముషీరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటు ఒక బ్రహ్మా స్త్రమని, ఆ ఓటును నమ్ముకున్నోల్లే అభివృద్ధి చెందుతారని, అమ్ముకున్నోళ్లు బిక్షగా ళ్లుగా ఉంటారని మాజీ ఎంపీ, బిజెపి సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నా రు. బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వారోత్సవాలు, సేవా పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వ హించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, బిజెపి సీనియర్ నాయకుడు బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, పలు సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సంద ర్భంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ సమాజంలోని కులాల అభివృద్ధి, బహుజనులు బాహు బలీలుగా కా వాలంటే కావాల్సింది ఆర్థిక, అధికార బలం ఎంతో అవసరమన్నారు.
మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా విస్మరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జక్కే వీరస్వామి గౌడ్, పల్సం సోమన్న గౌడ్, ఆకుల వెంకటేష్ గౌడ్, బాలగోని బాలరాజ్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.