calender_icon.png 21 May, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

21-05-2025 01:21:59 AM

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, మే 20 (విజయక్రాంతి) ః ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని భిక్కనూర్, రాజంపేట, దోమకొండ, కామారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి మండలాలలో ఆయా గ్రామాలకు చెందిన సిఎంఆర్‌ఎఫ్ పథకం కింద లబ్ధి పొందిన లబ్ధిదారులకు అందజేశారు.

భిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 25 మంది లబ్ధిదారులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు. రాజంపేట, దోమకొండ బిబిపేట్ మాచారెడ్డి పాల్వంచ రామారెడ్డి మండలాల్లోని లబ్ధిదారులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మారెడ్డి, ఆయా మండలాల బిజెపి నాయకులు పాల్గొన్నారు.