calender_icon.png 25 July, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడెం ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత

24-07-2025 12:27:38 AM

నిర్మల్, జూలై 23 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా 695 అడుగుల నీటిమట్టా న్ని నిలువ ఉంచుతూ ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కడెం నది పరివాహక ప్రాంతమైన ఆదిలాబాద్ బోత్ ఇచ్చోడఇంద్రవెల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి ఐదువేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్టు ప్రాజెక్టు తెలిపారు. 4,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి కడెం నది ద్వారా వదులుతున్నట్టు అధికారులు వివరించారు.