03-12-2025 12:00:00 AM
ఎర్రుపాలెం డిసెంబర్ 1 (విజయ క్రాంతి):ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కిండిల్ రూరల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఎర్రుపాలెం ఎస్ వి అకాడమీ పాఠశాల నందు ఎయిడ్స్ పై అవ గాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అవగాహన కరపత్రాలను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు వేమిరెడ్డి అనూష మాట్లాడుతూ యువత హెచ్‌ఐవి పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని మరియు సమాజంలో ప్రతి ఒక్కరిని అవగాహన పరచాలని కోరారు.
ఈ సంవత్సరం ఎయిడ్స్ దినోత్సవాన్నికి ఇతివృత్తంగా అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పం దనను మార్చడం. అనే ఇతివృత్తం తో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కనకవల్లి నాగరాజు పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ ,కరస్పాండెంట్ మిరియాల శ్యాం ప్రసాద్ ,ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.