calender_icon.png 2 December, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

02-12-2025 12:19:36 AM

రక్తం ద్వారా వ్యాపించే వ్యాధి ఎయిడ్స్ 

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 1, (విజయక్రాంతి)ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, దాక్కు సహకారంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య అధికారి డా. తుకారం రాథోడ్ పాల్గొని మాట్లాడుతూ హెచ్‌ఐవీ వంటి హెపటైటిస్-బి, హెపటైటిస్-సి కూడా రక్తం ద్వారా వ్యాపించే వ్యాధులేనని, యువతలో డ్రగ్స్ వాడకం పెరగడం ఆందోళనకారణ మన్నారు.

వివాహానికి ముందు జాతకాలు కాదని, హెచ్‌ఐవీ స్థితిని తెలుసుకోవడం ఎంతగానో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ హెచ్‌ఐవీ స్థితిని తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.అడిషనల్ రాజమల్లు, స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ:ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రతి వ్యక్తికి తప్పనిసరి అని, ఎవరి హెల్త్ వారు అన్న భావనతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.

ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ 20 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.అదేవిధంగా అవగాహన బృందం తమ ప్రదర్శనతో ప్రజలకు ఎయిడ్స్పై అవగాహన కల్పించింది.ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ కార్యకలాపాల్లో సేవలందించిన వారికి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సైదులు, కొత్తగూడెం బార్ కౌన్సిల్ అధ్యక్షులు లక్కీనేని సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.