calender_icon.png 2 December, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబాటి వినోద్‌కు మణిపూర్ యూనివర్సిటీ డాక్టరేట్

02-12-2025 12:18:33 AM

వనపర్తి క్రైమ్ , డిసెంబర్ 1 : వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన జాగృతి కాలేజీ యజమాని అంబాటి వినోద్ విద్యారంగంలో రసాయన శాస్త్రంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా  ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ మణిపూర్ నుండి డాక్టరేట్ పట్టా పొందారు.

సోమవారం వనపర్తి పట్టణంలోని జాగృతి  కాలేజీ యజమాన్యం విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా ఇంటర్మీడి యట్ విద్యాశాఖ అధికారి  ఎర్ర అంజయ్య, డాక్టర్ నిరంజన్ అయ్యా, డాక్టర్ బండారి శ్రీనివాసులు  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య రంగాల్లో గత 25 సంవత్సరా లుగా విద్యావ్యవస్థలో అలుపెరగని పోరాటం చేస్తూ అపజయం ఎరుగని విక్రమార్కుడిలాగా వేల సంఖ్యలో విద్యార్థులకు రసాయన శాస్త్రాన్ని భోదిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వివిధ రంగాలలో ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన కృషివర్యుడు, వందల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న గొప్ప మానవతవాదికి ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్  నుండి డాక్టరేట్ స్వీకరించిన అంబటి వినోద్ కుమార్ అని కొనియాడారు.

విద్యా రంగంలో అయినా సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీ వారు డాక్టరేట్ పట్టా ప్రధానం చేశారు అని అన్నారు. భవిష్యత్తులో  విద్యార్థులు అవార్డులు అందుకని ఉన్నత స్థానంలో ఉండాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యజమాన్యం భాగ్యస్వాములు శ్యామ్,సత్యనారాయణ, భాస్కర్,  కాలేజీ ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు