25-12-2025 02:30:44 AM
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): శ్రీనివాస రామానుజన్ జయంతి, శ్రీ మాండవ వెంకటసుబ్బారావు తొలి కాకతీయ విద్యాసంస్థల ప్రెసిడెంట్ స్మారకంగా కాకతీయ ఒలింపియాడ్ స్కూల్స్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన అకాడమిక్ మహోత్సవం బుధవారం ఘనం గా ముగిసింది. అకాడమిక్ మహోత్సవంలో భాగంగా స్పెల్లథాన్, టేడ్-కాకతీయ, క్విజ్తాన్, మ్యాథ్రత్న, అకాడమిక్ గేమ్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాఠశాల డైరెక్టర్లు రజనీకాంత్, రామో జీరావు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమాన్ని మూడు రోజులుగా ఇంత ఘనంగా విజయవంతం చేయడంలో సహకరించిన మీడియా మిత్రులకు, మా కాకతీయ విద్యార్థుల తల్లిదండ్రు లకు, అకాడమిక్, నాన్-అకాడమిక్ బృందా న్ని డైరెక్టర్లు అభినందించారు. ఇందుకు కృషి చేసిన లెక్చరర్లు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.