calender_icon.png 25 December, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఇంజినీరింగ్ విద్య ప్రాముఖ్యత’

25-12-2025 02:31:57 AM

జయప్రకాశ్ నారాయణ కాలేజీలో సెమినార్

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): స్థానిక జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఇంజినీరింగ్ విద్య యొక్క ప్రాముఖ్యతపై సెమినార్ నిర్వహించారు. స్థానిక రిషి జూనియర్ కళాశాల, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, కేజీబీవీ జూనియర్ కళాశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. 1997లో జేపీఎన్‌సీఈ ప్రారంభించామని, 2026లో 30వ బ్యాచ్‌కు స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.

గత సంవత్సరం యూజీసీ అటానమస్ గుర్తింపు సాధించామని తెలిపారు. గతంలో మూడు జేఎన్టీయూహెచ్ బంగారు పతకాలు సాధించిన ఘనత తమ కళాశాలకు దక్కుతుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో బీటెక్ చివరి సంవత్సరవ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇన్ఫోసిస్‌కు ఎంపికైనట్లు తెలియచేశారు. ఇన్ఫోసిస్‌కు ఎంపికైన భార్గవి మాట్లాడుతూ.. కాలేజీలో ఉత్తమ శిక్షణ తన విజయానికి దోహదం చేసిందన్నారు. కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ గురు రాఘవేంద్రరెడ్డి..

టీసీఎస్ ఐవోఎన్, ఐబీఎం, ఎన్‌ఎక్స్‌టీ వేవ్, టాస్క్ శిక్షణలు బీ.టెక్ చివరి సంవత్సరం నుంచే ప్రాంగణ ఎంపికలకు దోహద పడుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ కళాశాలలో లభ్యమయ్యే వసతులు వివరించారు. కళాశాల డెయిరీ, క్యాలెండర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిషి కళాశాల డీన్ భూపాల్‌రెడ్డి, ఆష్రఫ్ బేగం, చరిత, జరీనా బేగం, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీఈ చంద్రశేఖర్, సీహెచ్ వెంకటేశ్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.