25-12-2025 02:30:16 AM
ఖానాపూర్, డిసెంబర్ 24 (విజయక్రాం తి): ఏ గ్రామామైన అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పరంగా మంజూరైన నిధులు పథకాలను ప్రజలకు అందించి గ్రామాభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు వేడ్ము బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం దస్తురాబాద్ గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన గోపాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామా ల అభివృద్ధికి కట్టుబడి ఉందని త్వర లో అన్ని గ్రామాలకు నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే మంచి గుర్తిం పు వస్తుందని, గ్రామాల్లో అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.