10-09-2025 01:49:26 AM
ఆంధ్రప్రదేశ్‌లో ‘రియల్’ వ్యాపారం పుంజుకుందని వెల్లడి
జన్మదినం సందర్భంగా సతీమణితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
మేడ్చల్, సెప్టెంబర్ 9(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన అద్భుతమని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కితాబు ఇచ్చారు. ఆయన పాలనలో ఆ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా సతీమణి సరోజా రెడ్డితో కలిసి మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకు న్నారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఒకప్పుడు ఆంధ్రా వాసులు వారి భూములు అమ్ముకుని హైదరాబాద్‌లో ఆస్తులు కొనేవారన, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైం దన్నారు. ప్రస్తుతం తెలంగాణ వాసులు ఏపీలో ఆస్తులు కొంటున్నారని, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని మల్లారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ వేగంగా పురో గమిస్తోందని, ఆస్తుల విలువలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
అంతకుముం దు మాజీ మంత్రి అన్న సత్రంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మెట్ల మా ర్గం గుండా తిరుమల చేరుకున్నా రు. మల్లారెడ్డి వెంట మాజీ మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, మేకల కావ్య, నాయకులు డబి ల్ పూర్ రాజ మల్లారెడ్డి, భాగ్యరెడ్డి, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాసరెడ్డి, భాస్కర్ యాదవ్ తదితరులు ఉన్నారు.