calender_icon.png 10 September, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షరమే ఆయుధంగా కాళోజీ పోరాటం

09-09-2025 01:21:19 AM

‘బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష’ కావాలంటూ ప్రజా భాషను కోరి సరళమైన భాషలో, ప్రజలకు అర్ధమయ్యేలా, హృదయానికి హత్తుకునేలా కాళోజీ తన రచనలు సాగించారు. 

అందుకే ఆయనను ‘ప్రజాకవి’, ‘తెలంగాణ గుండె చప్పుడు’గా గౌరవిస్తారు.

సాహిత్యంలో, తెలంగాణ ఉద్యమంలో, సామాజిక స్పృహ లో చిరస్మరణీయుడైన మహనీయుడు కాళోజీ నారాయణరావు. బతుకు పోరాటానికి అక్షరాన్ని ఆయుధంగా మలచిన ప్రజాకవి జయంతి నేడు. ‘ఒక్క సిరాచుక్క.. లక్షల మెదళ్లకు కదలిక’ అంటూ కలంతో గలమెత్తిన ప్రజాకవి ఆయన. కవిత్వం కేవ లం కవి హృదయపు ఆవేదనే కాక ప్రజల గొంతుకగా ఎలా మారుతుందో కాళోజీ జీవితం నిరూపించింది. ఆయన కవి మా త్రమే కాదు, ఒక తాత్వికుడు, యోధుడు, ప్రజల మనిషి. కవిత్వాన్ని ఆయుధంగా మార్చి, అసమానతలపై గొంతెత్తిన ధీరు డు. ఆయన జీవితం, ఆలోచనలు, రచన లు నేటికీ ప్రతి యువకుడికి, ప్రతి సమాజ సేవకుడికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని దేశభక్తిని ప్రజల్లో నింపి, వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు నగర బహిష్కరణ శిక్ష విధించా రు. అయినా స్వాతంత్య్రంకై, పేదల సమానత్వం కోసం, న్యాయం కోసం నిరంతరం కృషి చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలను కవిత్వంగా ప్రపంచానికి వినిపించా రు. కర్నాటక నుంచి వరంగల్‌కు తరలివచ్చిన కాళోజీ కుటుంబం వరంగల్‌లో స్థిరపడింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య ను వరంగల్‌లోని మడికొండలో, హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1939 లో హైదరా బాద్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్శితులై ఆర్య సమాజ్, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పా ల్గొన్నారు.

ఆంధ్ర మహా సభ ప్రారంభమైనప్పటి నుంచి దాని కార్యకలాపాల్లో చురు కుగా పాల్గొన్నారు. అలాగే, సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాత రం ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆనాటి హైదరాబాద్ రాష్ర్టంలో స్వా తంత్య్ర ఉద్యమాన్ని నడిపిన కాళోజీ.. పలు సార్లు జైలు జీవితం గడిపారు. పౌర హక్కుల సాధనలో క్రియాశీలకంగా ఉన్న ఆయన.. తుర్కుండె కమిటీలో సభ్యుడిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు మూడు సార్లు పోటీ చేసిన కాళోజీ.. ఒకసారి విజయం సాధించారు. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా.. అనంతర కాలంలో అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు.

ప్రజల దుస్థితిపై రచనలు

‘బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష’ కావాలంటూ ప్రజా భాషను కోరి సరళమైన భాషలో, ప్రజలకు అర్ధమయ్యేలా, హృదయానికి హత్తుకునేలా కాళోజీ తన రచనలు సాగించారు. అందు కే ఆయనను ‘ప్రజాకవి’, ‘తెలంగాణ గుండె చప్పుడు’ గా గౌరవిస్తారు. కాళోజీకి చిన్ననాటి నుంచే కవిత్వం పట్ల ఆసక్తి పెరిగింది. ఆయన భావాలు అక్షరాలుగా మారి స మాజాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాయి. ఆనాటి నిజాం పాలన, సామాజిక అసమానతలు, అణచివేత ఆయన కవిత్వానికి ఊపిరి పోశాయి. నా గొడవ, జీవన గీత, తుది విజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు.. పేరు గాంచిన రచనలు. కాళోజీ కవిత్వం పండితుల కోసం కాదు, పామరుల కోసం.

ఆయన సరళమైన భాషలో గొప్ప భావాలను పలికించారు. ‘అన్యా యం జరిగితే సహించొద్దు.. ఎదురించాలి’ అనేదే ఆయన కవిత్వం ప్రధాన సందేశం. ‘నా గొడవ’ సంపుటాలు ఆయన జీవన పోరాటాల చరిత్రకు, ప్రజల వ్యథకు అద్దం పట్టాయి. తన కవిత్వం ద్వారా సామాన్యుల జీవిత బాధలను, ఆకాంక్షలు, వారి కష్టాలను చిత్రించారు. ఆయన కవిత్వంలో వ్యంగ్యం, హాస్యం, నిరసన, ప్రేమ, ప్రశ్న ఇలా అన్నీ ఉంటాయి. ప్రజల హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం జరిగిన పోరాటాల్లో ముందుండి తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు నిజాం పాలనకు వ్యతిరేకంగా, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. జైలుకు వెళ్లినా, ఆయనలో పోరాట స్ఫూర్తి తగ్గలే దు. ‘అక్షరం మనిషిని బానిసగా ఉంచడానికి కాదు, విముక్తి చేయడానికి’ అనే నమ్మకంతో బతికారు. ప్రాంతీయ అసమానతలపై, ప్రజల దుస్థితిపై పదేపదే రచనలు చేశారు.

అన్యాయాన్ని ఎదిరిస్తేనే

‘తెలుగు బిడ్డవు రోరి.. తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటి రా.. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదం చూ సకిలించి.. ఆంధ్రుడా చావవెందుకు రా?’ అంటూ సూటిగా తెలుగు మాట్లాడుటకు ఇష్టపడని వారికి సురుకులు అంటి చాడు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే.. నా గొడవకు సంతృప్తి.  అన్యాయం అంతరిస్తే.. నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినోడు.. నాకు ఆరాధ్యుడు’ అని సగ ర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా.. భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పురాష్కారం పద్మవిభూషణ్‌తో కాళో జీని సత్కరించింది. కాళోజీ కవిత్వానికి, ఆ యన జీవితానికి మధ్య ఎలాంటి వ్యత్యా సం లేదు. ఆయన కేవలం కవితలు రాసి ఊరుకోలేదు, వాటిని ప్రజల మధ్యకు తీ సుకెళ్ళారు. సామాజిక అసమానతలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడేవారు. రైతుల కష్టాలు, విద్యార్థుల కలలు, కార్మికుల జీవితాలే కవితా వస్తువులు. ఆయన మాటల్లో ప్రజల బాధ ఉంది, ప్రేమ ఉంది, న్యాయం కోసం పోరాటపు జ్వాల ఉంది.

అందరివాడు కాళోజీ

కాళోజీ ఎంత గొప్ప కవో, అంతకు మించి గొప్ప మనిషి. ఆడంబరాలకు పోక, నిరాడంబర జీవితంతో అందరిలో కలిసిపోయి అందరివాడయ్యాడు. కులం, మ తం, ప్రాంతం.. వీటికి ఆయన అతీతులు. కాళోజీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ భాషా దినోత్సవం’ గా నిర్వహిస్తుంది. ఈ రోజున కేవలం ఆయనను స్మరించడం సరిపోదు. ఆయన ఆదర్శాలను స్వీకరించి అన్యాయాన్ని ప్రశ్నించే గుణం ఉన్నంతవరకు కాళోజీ మన మధ్యే జీవిస్తూ ఉంటారు. ఉపాధ్యాయులు, కళాకారులు, రచయితలు, సామాజిక కార్యక ర్తలు, పాలకులు ఆయన మార్గాన్ని అనుసరించి ప్రతి మనిషిలో ఉన్న మానవ త్వాన్ని మేల్కొలిపి సమానత్వం కోసం ముందడుగు వేయాలి. అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

 వ్యాసకర్త సెల్: 8466827118