08-11-2025 12:38:55 AM
కమల్ హాసన్ మరో కొత్త వెంచర్‌ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ‘కేహెచ్‌ఏఏ’గా ప్రచారంలో ఉంది. ‘హంట్ మోడ్ ఆన్’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా కమల్‌హాసన్ ఐకానిక్ స్థాయికి సరిపోయే భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ నిర్వహించనుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందించనున్నారు. ఎడిటింగ్ షమీర్ కేఎం, ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతను వినేష్ బంగ్లాన్ నిర్వర్తిస్తారు. ఈ ప్రాజెక్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.