calender_icon.png 8 November, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ చంద్రుడిలో ముక్క..

08-11-2025 12:40:09 AM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

2026, మార్చి 27న  థియేటర్లలో విడుదల కానుంది. మేకర్స్ శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ని విడుదల చేశారు. ‘ఆ చంద్రుడిలో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా..’ అంటూ సాగుతోందీ పాట. ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన ఈ గీతానికి బాలాజీ సాహిత్యం అందించగా, మొహిత్ చౌహాన్ పాడారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొ ల్లా; ఎడిటర్: నవీన్ నూలి.