08-09-2025 12:00:16 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 7( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లాలో అధిక వరదలు సంభవించిన నేపథ్యంలో ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆహ్వానం మేరకు వరుసగా రెండవ రోజు ఆదివారం జిల్లాలో రామకృష్ణ మట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా లింగంపేటమండలంలోని పోల్కంపేట్ రైతువేదికలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
ఈ క్యాంపులో పోల్కంపేట్, పోల్కంపేట్ తండా, కోమటిపల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్, సుమారు 252 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి దగ్గు, జలుబు,నొప్పులు, బిపి, షుగర్ తదితర వ్యాధులకు మెడిసిన్ అందించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మట్ ప్రతినిధులతో పాటు ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి, స్థానికత తాసిల్దార్ ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి పట్టణంలోని జి.ఆర్ కాలనీలో రామకృష్ణ మట్ వారు వైద్య శిబిరం నిర్వహించి జిఆర్ కాలనీకి చెందిన 63 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలందించారు. రామారెడ్డి మండల కేంద్రంలో రామకృష్ణ మట్ వారు నిర్వహించిన వైద్య శిబిరంలో 125 మందికి వైద్య సేవలు అందించారు.