calender_icon.png 8 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాదికాలం పూర్తి చేసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌కు ఘన సన్మానం

08-09-2025 12:00:00 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టి ఎస్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి చేపట్టి విజయవంతంగా ఏడాది కాలం పూర్తి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రామ్మూర్తి గోపి ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ ను భారీ మాల తో పాటు షాలోతో సన్మానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ కృషి చేస్తున్నారని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని ముఖ్యంగా నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పార్టీ ముందుకెళ్తోందని పలువు వక్తలు అన్నారు మహేష్ కుమార్ గౌడ్ సన్మానించిన వారిలో స్థానిక యోజన కార్యకర్తలు ఎన్‌ఎస్యుఐ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు.