17-01-2026 04:15:08 AM
ప్రారంభించిన ప్రముఖ సినీనటి భూమికా చావ్లా
ఎల్బినగర్, జనవరి 16 : మూడు దశాబ్దాలకు పైగా వైద్యరంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్న కా మినేని ఆస్పత్రి.. మహిళలు, పిల్లల సంరక్షణ కోసం నిరంతర ఆధునిక వైద్యం అందేలా రూపొందించిన ప్రపంచ స్థాయి సమగ్ర మదర్ అండ్ చైల్డ్ కేర్ యూనిట్, ఎం’బ్రేస్ ను శుక్రవారం ప్రారంభించింది. ఈ యూనిట్‌ను ప్రముఖ సినీ నటి భూమికా చావ్లా ప్రారంభించారు. తల్లులు, పిల్లలు, మొత్తం కుటుంబాలకు సంపూర్ణమైన, నిరంతర వైద్యం అందించేం దుకు ఈ అత్యాధునిక విభాగాన్ని ఆస్పత్రిలో రూ పొందించారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలు, వివిధ విభాగాల నిపుణుల అనుభవం, మానవీయ సంరక్షణను ఏకీకృతం చేస్తూ, మదర్ అండ్ చైల్ ఆరోగ్య అవసరాలను తీర్చుతూ ఎం’బ్రేస్ పని చే స్తుంది. ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి సీఈవో డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ, ఎం’బ్రేస్ ద్వారా మదర్ అండ్ చైల్ ఆరోగ్య సంరక్షణను అత్యాధునిక వైద్య విధానంతో కొత్త దిశలో సేవలంది స్తున్నాం.
కుటుంబాన్ని సంరక్షణ కేంద్రంగా ఉంచి, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక, భావోద్వేగ, పోషక అవసరాలను కూడా సమగ్రంగా చూసుకోవడమే మా లక్ష్యం. ఆధునిక ఐసీయూలు, కార్డియాక్ సపోర్ట్ వ్యవస్థ, 24/7 బ్లడ్ బ్యాంక్ సేవలతో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను కాపాడే నమ్మకమైన కేంద్రంగా కామినేని ఆస్పత్రికి మంచి పేరు, అనుభవం ఉండడంతో అత్యాధునిక ఎం’బ్రేస్ విభాగాన్ని ప్రారంభించాం.
ఆస్పత్రిలో మోడ్రన్ క్రిటికల్ కేర్, ఆధునిక కార్డియాక్ సిస్టమ్స్, రోబోటిక్ సహాయక శస్త్రచికిత్సలు, 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రముఖ నటి భూమిక చావ్లా మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ అనేది సంరక్షణ, అవగాహన, కుటుంబ సభ్యుల నిరంతర మద్దతు అవసరమైన ప్రక్రియ. వైద్య చికిత్సతో పాటు తల్లుల భావోద్వేగ, మానసిక శ్రేయ స్సును గుర్తించే ఎం’బ్రేస్ ఒక చక్కని అధునాతన ఆలోచనాత్మక ప్రయత్నం.
ఇది కామినేని ఆస్పత్రిలో అనేక కుటుంబాల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువస్తుందని నమ్ముతున్నాను అన్నారు. ఎం’ బ్రేస్ యూనిట్ టీమ్ లో అనుభవజ్ఞులైన ఆబ్స్టెట్రిషియన్స్ & గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, నియోనాటాలజిస్టులు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు,
మెం టల్ హెల్త్ ఎక్స్పరట్స్, న్యూట్రిషనిస్టులు, లాక్టేషన్ కన్సల్టెంట్స్, శిక్షణ పొందిన నర్సులు, మిడ్వైవ్సి, చైల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్టులతో కూడిన బలమైన బృందం ఉంటుంది. ఈ సమన్వయ విధానంతో వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన నిరంతర సంరక్షణతో పాటు అవసరమైన ప్పుడు అత్యవసర, కార్డి యాక్,రక్త మార్పిడి సేవలను వెంటనే అందిస్తోంది.