17-01-2026 04:13:23 AM
ఏపీ స్పీకర్‌కు తెలుగు మహా సభల తీర్మానాల ప్రతి సమర్పణ
నర్సీపట్నం, జనవరి 16: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడును ఎన్టీఆర్ జీవన సాఫల్య పుర స్కారంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ నర్సీపట్నం లోని ఎన్టీఆర్ గ్రౌండ్‌లో నిర్వహించిన సం క్రాంతి సంబరాల్లో అందజేసి ఘనంగా సత్కరించారు. అయ్యనపాత్రుడు నాలుగు దశా బ్దాల విశేష ప్రజా సేవకు 3వ ప్రపంచ తెలు గు మహా సభలకు ఆయన అందించిన విశి ష్ఠ సేవలకు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆయన్ని తెలుగు జాతి స్ఫూర్తి మూర్తి ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరిం చినట్లు గజల్ శ్రీనివాస్ అన్నారు.
మూడవ ప్రపంచ తెలుగు మహా సభల తీర్మానాల ప్ర తిని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడుకు అందజేశారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో తప్పక ఈ తీర్మానాలపై చర్చ జరుపుతామని అయ్యనపాత్రుడు హామీ ఇచ్చారు. ఈ సభలో ఎంపీ సీఎమ్ రమేష్, ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ కె సత్యనారాయణ, చలన చిత్ర ప్రముఖులు మనో, కోటి, పరిషత్తు సభ్యులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, అడ్డాల వాసుదేవ రావు, పి. రామచంద్ర రాజు, టీ.పురుషోత్తం, జయహో పెద్దింటి సురేష్ తదితరులు పాల్గొన్నారు.