03-11-2025 12:35:34 AM
నాగర్ కర్నూల్, నవంబర్ 2 (విజయక్రాంతి)నిజాం కాలేజ్లో జరిగిన 35వ దేవేందర్ యాదవ్ మెమోరియల్ రన్2025 అథ్లెటిక్స్ పోటీల్లో నాగర్కర్నూల్ జిల్లా లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.అండర్10 విభాగం 1 కిలోమీటర్ పరుగులో శ్రీనాథ్, నేహాలు బ్రౌన్ మెడల్స్ సాధించగా, అండర్12 విభాగం 1 కిలోమీటర్లో అభినవ్ రెడ్డి గోల్ మెడల్ గెలిచాడు. అలాగే అండర్15 విభాగం 2 కిలోమీటర్ రన్లో గణేష్ గోల్డ్, విగ్నేష్ బ్రౌన్ మెడల్స్ దక్కించుకున్నారు.
అండర్18 విభాగం 2 కిలోమీటర్లో అజయ్ గోల్డ్, అనిల్ సిల్వర్ మెడల్స్ సాధించారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని కోచ్ రానా మల్లేష్ అన్నారు. వీరి విజయం తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్కు గర్వకారణమన్నారు.