03-11-2025 12:35:14 AM
ఆలేరు, నవంబర్ 2 (విజయ క్రాంతి): ఆలేరు మండలం శర్భనాపురం గ్రామ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా సైదాపురం సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామం లోని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ సమావేశం గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు బుగ్గ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గా సైదా పురం సురేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి సారయ్య, ఉపాధ్యక్షులుగా కారె రమేష్,బోడ అశోక్, ప్రధాన కార్యదర్శిగా వట్టెపు శ్రీశైలం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షుడు సైదాపురం సురేష్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలసి కష్టపడతానని, గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నాయకత్వంలో ఆలేరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు బుగ్గ నరేష్ని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీత శ్రీహరి, ఉపసర్పంచ్ సైదాపురం శాంతమ్మ, గడ్డమీది నరేష్, మండల నాయకులు బుగ్గ నవీన్, సీత సత్యనారాయణ, బోడ నరేష్, సిరిగిరి స్వామి, బోడ శ్రీకాంతు సూదగని నవీన్, బుగ్గ ప్రవీణ్, సైదాపురం ప్రశాంత్, బోడ రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.