10-12-2025 12:47:13 AM
శ్రీనివాస్‌యాదవ్, శంకర్‌యాదవ్
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): బీజేపీ సీనియర్ నాయకుడు ఏజి కాండ్లికర్ మృతి తీరని లోటు అని గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఎం శంకర్ యాదవ్ అన్నారు. కాండ్లికర్ గొప్ప జాతీయవాది అని, అంకుఠిత శ్రద్ధతో ప్రజాసమస్యల గురించి నిస్వార్ధంగా సేవలందించారని, సుల్తాన్ బజార్‌లో మొట్టమొదటిసారి ఫుట్‌పాత్ వ్యాపారులను పోలీసులు తొలగిస్తున్నప్పుడు వారిని సంఘటితం చేసి వారి హక్కులకోసం పోరాటాలు చేసి వారికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు.
తనను అనేక ఉద్యామాల్లో పాల్గొనింపజేసి సమస్యలు పరిష్కరింపజేశారంటూ కొనియా డారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అఖిల భారత ఫుట్‌పాత్ వ్యాపారుల కమిటీలో కాండ్లికర్‌ను సభ్యునిగా నియమించినప్పుడు ఫుట్ పాత్ వ్యాపారులకోసం ఒక పాలసీ ఏర్పాటు చేయడంలో తనకి తోడ్పడ్డారని చెప్పారు. అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వ స్థాయిలో ఫుట్‌పాత్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషిచేశారని, అలాంటి నాయకుడు మృతిచెందడం చిరు వ్యాపారులకు తీరని లోటు అని మాజీ కార్పొరేటర్ వై కృష్ణ, గడ్డం శ్రీనివాస్ యాదవ్, శంకర్‌యాదవ్, శేషు, ఆశిష్ పేర్కొన్నారు.