calender_icon.png 10 January, 2026 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

09-01-2026 06:09:23 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ  పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తా వద్ద శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్ మాట్లాడుతూ...  కాంగ్రెస్ పార్టీ  ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్​ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు.  ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు తగదని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయడం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. కేటీఆర్ తన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.