22-05-2025 12:00:00 AM
-అమృత్ నిధులతో కొత్త రూపం
-నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని
-హాజరు కానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు బండి, పొన్నం
కరీంనగర్, మే 21 (విజయక్రాంతి): వి మానాశ్రయానికి తీసిపోని విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను అద్భుతంగా తీర్చిది ద్దారు. ఆధునిక హంగులతో విమానాశ్రయా న్ని మరిపించేవిధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్త రూపును సంతరించుకుంది. ఆధునీకరించిన ఈ స్టేషన్ ను ప్రధానమంత్రి నరేం ద్ర మోడీ గురువారం ఉదయం 9:30 గంటలకు వర్చువల్ ప్రారంభించనున్నారు.
కరీం నగర్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. రైల్వేప్రయాణికులకు సరికొత్త అనుభూతితోపా టు మంచి సౌకర్యా లను అందించాలనే లక్ష్యం తో భా రత రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది.
ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్ రైల్వే స్టే షన్‌ను ఆధునీకరించారు. ఆధునాతన ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. విశాలైన వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రమైన ఫ్లాట్ ఫా రాలు, మోడ్రన్ టాయిలెట్లు నిర్మించారు. రై ల్వే స్టేషన్ పరిసరాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదపరిచేలా లాన్‌లు, మొక్కలతో అభివృద్ధి చేశారు.
రాత్రి వేళలో లైటింగ్‌తో కరీంనగర్ స్టేషన్ వెలుగులు విరాజిల్లేలా ఏర్పాట్లు చేశారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కోసం రైల్వేశాఖ 25.85 కోట్ల రూపాయలను కేటాయించింది. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా రెండేళ్లలోపు పునరాభివృ ద్ధి పనులను పూర్తి చేశారు. గడువులోగా పూర్తికావడంతో ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోడీ స్టేషన్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.