10-08-2025 12:47:59 AM
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలంలోని శ్రీ దండు మైసమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్‌గా తంగేళ్ల కర్ణాకర్‌రెడ్డి(కాంగ్రెస్ పార్టీ లీడర్) ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక సందర్భంగా నూతన చైర్మన్ తంగేళ్ల కర్ణాకర్‌రెడ్డిని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి నరోత్తమ్‌రెడ్డి, వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘ నంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
కర్ణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తన ఎ న్నికకు సహకరించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి, ఏఐసీసీ సభ్యులు నరోత్తమ్‌రెడ్డికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వే ణారెడ్డికి, పోతు భాస్కర్‌కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి దేవాలయంకు వచ్చే భ క్తులకు మెరుగైన సేవలందిచడానికి, దేవాల యం అభివృద్ధికి పాటుపడతామన్నారు.