calender_icon.png 10 August, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుంధతి నగర్‌లో సివరేజ్ పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

10-08-2025 12:46:09 AM

గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్..

ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి):  అరుంధతి నగర్ బస్తీలో జరుగుతున్న సివరేజ్ పైప్ లైన్  నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం అరుంధతి నగర్ బస్తీలో నూతన శివరేజి పైప్ లైన్ నిర్మాణ పనులను ఆమె సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల వాటర్ వరక్స్ ఏర్పాటు చేసే నూతన  పైప్ లైన్ ఏర్పాటు పనులకు జిహెచ్‌ఎంసి  ఇంజినీరింగ్ అధికారులు అడ్డు పడడంతో ప్రత్యేక చొరవ తీసుకుని ఇరు శాఖాల  అధికారులతో సమన్వయ సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. గత వారం జిహెచ్‌ఎంసి  కమిషనర్  ఆర్.వి.కర్ణన్ తో  సమీక్షించి పైప్ లైన్ ఏర్పాట్లకు అనుగుణంగా రోడ్డు తవ్వకాలకు అనుమతివ్వాలని కోరినట్లు తెలిపారు.   

వెంటనే కమిషనర్ స్పందించి రోడ్డు త్రవ్వకాల కొరకు అనుమతులను జారి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, వాటర్ వరక్స్ మేనేజర్ కృష్ణ మోహన్, లైన్  సూపర్వైజర్ శంకర్,బిజెపి ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం. ఉమేష్, బస్తి వాసులు ధన్ రాజ్, దేవేందర్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.