calender_icon.png 10 August, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పారామంలో సాంస్కృతిక నృత్యలు

10-08-2025 12:49:36 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 9:  మాదాపూర్ లోని శిల్పారామంలో రాఖి పండుగ పురస్కరించుకొని యంపీ థియేటర్ లో సాంస్కృతి క కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు సందర్శకులను ఎంతగానో ఎంతగానో అలరించాయి.

శ్రీ కృతి నృత్య అకాడమీ  డాక్టర్ రోజని వల్లభనేని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో వినాయక కౌతం, పుష్పాంజలి, చంద్రచూడా, చరణములే నమ్మితి, ఆత్మ రామ, బృందావ స్సానం, కల్యాణ రామ, శివతాండవం, రా మాయణ శబ్దం, ధనశ్రీ తిల్లాన వంటి అంశాలను కంతి, అను, వేదం, అక్షద, రజ్వీ, సుకన్య, ఆధ్య, రితిక, మహాశ్రీ, గుణ తస్మితా తదితర కళాకారులు ప్రదర్శించారు.

అనంత రం  శ్రీ రామ నాటక నికేతన్ గురు వు మం జుల రామస్వామి శిష్య బృందం భరతనా ట్య ప్రదర్శనలో కుండల పై దీపాలతో వసుదైక కుటుంబం, శివస్తోత్రం, నటనమాడి నారు, గోపిక మాధవం అంశాలను వరేణ్య, స్మితిక, వర్ణిక, సాన్విత, అను ష్క, ఆకృతి, వర్ష, రెబెక్కా, వంశిక, శరణ్య, సహస్ర, సంధ్య, తనుశ్రీ మొదలైన వారు ప్రదర్శించి వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.