calender_icon.png 20 November, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన కార్తీక దీపోత్సవ వేడుకలు

20-11-2025 12:00:00 AM

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి కుటుంబ సభ్యులు

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్  (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కార్తిక దీపోత్సవం వేడుకలు అంబరాన్నంటేలా సాగాయి. లక్షట్ పేటకు చెందిన ప్రణవ్ శర్మ ఆధ్వర్యంలో 18 మంది వేద పండితులు ప్రత్యేక శివలింగార్చన గణపతి పూజ చేయడంతో పాటు దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.

పూజలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, సోనేరావు దంపతులతో పాటు కుమారుడు సాయినాథ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియో జకవర్గ ప్రజల సంక్షేమం కోసం కార్తీకదీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు మర్సుకోలా సరస్వతి, బుర్స పోచయ్య, గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.