19-11-2025 12:00:00 AM
మణికొండ, నవంబర్ ౧8 (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో ప్రవాస భారతీయులు (ఎన్నారై లు) క్రియాశీలక పాత్ర పోషించాలని జితేందర్ మెరుగు పిలుపునిచ్చారు. తన అమెరికా పర్యటనలో భాగంగా మిత్రబృందం ఆహ్వా నం మేరకు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) కనెక్టికట్ స్టేట్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. మీటింగ్ అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర అభివృద్ధి దిశ గా జరుగుతున్న ప్రయత్నాలను వివరించా రు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సవాలుగా స్వీకరించిన మూసీ ప్రక్షాళన, అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, మరియు పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మారుస్తున్న తీరును ప్రవాసులకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృ ద్ధి కార్యక్రమాలపై ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీ హరి మందాడి, చాప్టర్ కో-ఆర్డినేటర్ శ్రీమాన్ ముప్పనేని, నరేన్ రెడ్డి పాల్గొన్నారు.