30-09-2025 12:00:00 AM
తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శనివారం తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ‘మీట్ ది పీపుల్’ ఎన్నికల ప్రచార సభ విషాదంగా మారింది. కరూర్‌లోని వేలుసామిపురంలో జరిగిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 41 మంది మృతి చెందగా ఇందులో మహిళలు, చిన్నారులు కూ డా ఉండడం గమనార్హం. దాదాపు వంద మందికి పైగా గాయాలపాలయ్యారు.
2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 13 నుంచే ‘మీట్ ది పీపుల్’ పేరుతో ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని ఆయన పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్ తన షెడ్యూల్‌లో భాగంగా శని వారం ఉదయం నామక్కల్‌లో, మధ్యాహ్నం కరూర్‌లోని వేలుస్వామిపు రం సభలో ప్రసంగించాలి.
అయితే నామక్కల్‌లో కేఎస్ థియేటర్ వద్ద ఉ దయం 9 గంటలకు జరగాల్సిన ప్రచార సభ విజయ్ ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం ౨.౩౦ గంటలకు జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకే కరూర్ సభకు విజయ్ వస్తారని టీవీకే పార్టీ ప్రతినిధులు ముందే పేర్కొనడంతో జనాలు భారీగా తరలివచ్చారు. అయితే అనుకున్నదానికంటే విజయ్ నాలుగున్నర గంటలు ఆలస్యంగా రావడం, అప్పటికే దాదాపు ఏడు గంటల నుంచి తమ అభిమాన నాయకుడి రాక కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా విజ య్ రాత్రి 7.30 గంటలకు రావడంతో జనసమూహం మధ్య చిన్న తోపులాట జరిగింది. ఇది గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని 20 నిమిషాల్లోనే ము గించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విజయ్ వెళ్లిపోయిన కాసేపటికే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇరుకైన రోడ్లతో కూడిన ప్రాంతం, పరిసరాలు కావడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో జనం ఇబ్బంది పడ్డారు. రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తొక్కిసలాట జరిగింది.
సభకు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో రావడంతో ఒకరిపై ఒకరు తొక్కుకుంటూ వెళ్లడంతో చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. అయి తే విజయ్ ని ర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని టీవీకే నేతలు ఆరోపించారు. అయితే సభకు 10వేల మంది వస్తారంటూ తమ వద్ద ముందస్తు అనుమతి పత్రం తీసుకున్నారని, కానీ విజయ్‌పై అభిమానంతో సభకు భారీగా తరలివస్తారని ఊహించి తాము కట్టుదిట్టమైన భద్రతనే ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర డీజీపీ జి. వెంకట్రామన్ తెలిపారు.
అయితే సభా సమయం కూడా మొదట ఒక టి చెప్పి ఆ త ర్వాత సమయం మార్చేయడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసుల వాదన. ఇరు వాదనల్లో ఎవరిది నిజం అనే విషయం పక్కనబెడితే తొక్కిసలాట కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏది ఏమైనా క రూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచారసభలో జరిగిన తొక్కిసలాట ఘటన రాజకీయంగా అన్ని పార్టీలకు ఒక గుణపాఠం లాంటిది.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తరహా తొక్కిసలాట జరగడం, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం.. రాజకీయ పార్టీలను ఉలిక్కిపడేలా చేసింది. తమ భవిష్యత్తు ప్రణాళికలను ఎలా చేసుకోవాలనే సందిగ్ధత ఏర్పడేలా చేసింది ఈ తొక్కిసలాట ఘటన.