calender_icon.png 30 September, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి

30-09-2025 12:00:00 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకుండా రేవంత్ సర్కార్ కాలాయాపన చేస్తుంది. నామినేటెడ్ పదవులైన దేవాలయ కమిటీలు, లైబ్రరీ, విద్యా, వైద్య కమిటీలు, పర్యావరణ, రైతు కమిటీలు ఇలా ఏవీ చూసుకున్నా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో ఎలాంటి కదలిక లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన ఇందిరమ్మ కమిటీలు కూడా నామమాత్రంగా మారిపోయాయి.

దీంతో గ్రామ స్వరాజ్యం ఊహించని విధంగా దెబ్బతింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా,జెడ్పీటీసీలుగా పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయిన వారిని గుర్తించి వారికే నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన అవసరముంది. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే సమయంలో అవసరమైతే ముందస్తు సర్వే చేయించి, పార్టీ ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకొని వాటి పరిశీలన అనంతరమే పదవుల భర్తీ చే పడితే బాగుంటుంది.

తెలంగాణ పునర్‌నిర్మాణంపై  విధానాల రూ పకల్పనలో తొందరపాటు అవసరం లేదు. శాఖల వారీగా అధ్యయనం చేసుకొని, ప్రజలకు కావాల్సిన రీతిలో విధానాలను తీ సుకుపోవాలి. పునాది పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యమైతే గ్రామ స్వ రాజ్య పాలనకై విధులు, బాధ్యతలు ఇందిరమ్మ కమిటీలకు అప్పగించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని కోరుతున్నాం.

 మందుగుల బాలకృష్ణ, యాదాద్రి జిల్లా