09-09-2025 12:00:00 AM
మత్తు పదార్థాలను నిరోధించడంలో భాగస్వాములు కావాలి
సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్చెరు, సెప్టెంబర్ 08(విజయ క్రాంతి):నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని, భావి భారత పౌరులను తయారు చేయాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉంద ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అ న్నారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న ఎ మ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన అభినందించారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన నియోజకవర్గస్థాయి ప్రభుత్వ పా ఠశాల గురుపూజోత్సవ వేడుకలకు ఎస్పీ పరితోష్ పంకజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో వి ధులు నిర్వర్తిస్తున్న 100 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.
సమాజంలో ఒక విద్యార్థి పౌరుడుగా ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలక మని అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఉ పాధ్యాయులు ఉత్తమ భవిష్యత్తును అందిస్తారని అన్నారు. పటాన్చెరు నియోజకవ ర్గంలో ప్రతినెల సైబర్ క్రైమ్ లు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గూడెం మహి పాల్ రెడ్డి మాట్లాడుతూ మినీ ఇండియాగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక శాతం పేద,
మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని,వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ప్ర భుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు 5 వేల రూపాయల చొప్పున నగదు పారితోషకాన్ని అందించి అభినందించారు.
ఈ కార్య క్రమంలో డీఎస్పీ ప్రభాకర్, రామచంద్రాపు రం కార్పోరేటర్ పుష్ప నగర్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసిలు దేవానందం, కుమార్ గౌడ్, మాజీ ఎం పీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీఐలు వినాయక రెడ్డి, లాలూ నాయక్, ఎంఈఓ లు పీపీ రాథోడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.