25-12-2025 12:00:00 AM
తరిగొప్పుల, డిసెంబర్ 24 (విజయక్రాంతి): మాన్సింగ్ తండా గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కత్తుల కొమురయ్య ను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆదేశాల మేరకు ని యోజకవర్గ వర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు తరిగొప్పుల మండల అధ్యక్షులు వగలబోయిన యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల ఆధ్వర్యంలోబుధవారం రోజున తరిగొప్పుల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.
ఉపాధ్యక్షుడిగా సభావత్ అలపతి నాయక్, ప్రధాన కార్యదర్శిగా కావటి సుధాకర్, కోశాధికారి ఎరువ సుజాత సభ్యులుగా సుంకు అంజయ్య, కొండ్ర తార కుమార్ ,లౌడియా సుగుణ,అర్జుల జ్యోతి, ఎనికయరు సందర్భంగా కత్తుల కొమురయ్య మాట్లాడుతూ.. నా పై నమ్మకం ఉంచి ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్జుల మధుసూదన్ రెడ్డి, పండుగ కనకయ్య, బృంగి శివకుమార్, మూడవత్ సంపత్ నాయక్, కల్వ రాజుగారు, భీమా నాయక్ మంద చంద్రయ్య,సదయ్య పల్చని రమేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.