calender_icon.png 25 December, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామన అవతారంలో దర్శనమిస్తున్న సీతారామచంద్రస్వామి

25-12-2025 12:00:00 AM

భద్రాచలం, డిసెంబర్ 24, (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగు తున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు బుధవారం స్వామివారు వామన అవతారంతో భక్తులకు దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వామన అవతారంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్య లో ఆలయానికి తరలివస్తుండగా, ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్ర త్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొ క్కులు తీర్చుకున్నారు.వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌ కర్యాలు కలగకుండా దేవస్థానం అధికారు లు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు.