calender_icon.png 17 August, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్ లైసెన్స్‌లు రెన్యూవల్ చేయించండి

28-07-2025 01:13:57 AM

ఎమ్మెల్యే శ్రీగణేశ్‌కు ఎక్స్ సర్వీస్‌మెన్ల విజ్ఞప్తి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్‌లు బ్యాంకులలో, ఏటీఎంలలో పనిచేయడానికి వారి గన్ లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకుంటూ జీవనోపా ధి పొందుతారు. ఇటీవల వారి లైసెన్స్‌లు రెన్యూవల్‌కు అనుమతి ఇవ్వాలని పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నా, తమకు అనుమతి ఇవ్వడం లేదని,

దీంతో జీవనోపాధి కోల్పోతున్నామని, తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎక్స్ సర్వీస్‌మెన్లు ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వారి సమస్యను సావధానంగా విన్న ఎమ్మెల్యే, సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.