16 June, 2026 | 3:13 AM

వావ్..వాట్ ఏ పిక్చర్

19-08-2024 01:10 AM
  1. అంతరిక్షం నుండి భారతదేశం ఫొటో తీసిన నాసా వ్యోమగామి
  2. రాత్రిపూట భారత్ వెలిగిపోతోందని ట్యాగ్‌లైన్
  3. ఫన్నీగా స్పందిస్తున్న నెటిజన్లు

న్యూ ఢిల్లీ, ఆగస్టు 18: నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ అంతరిక్షం నుండి భారతదేశ భూభాగానికి సంబంధించిన అద్భు తమైన ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటో లో రాత్రిపూట ఓ మెరుపు వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో.. అలా భారత భూభాగం మెరిసిపోతోంది. ఆగస్టు 17న ఎక్స్‌లో అతడు చేసిన పోస్టుకు ఇప్పటివరకు ఒక మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. చిత్రం దిగువ మధ్యో మీరు చిన్నచిన్న గీతలు కనిపిస్తున్నాయి కదా అవి నీటిలో పడవలు ప్రాయణిస్తున్న దృశ్యాలు అని తెలిపాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. ‘వావ్ వాట్ ఏ పిక్చర్’.. ‘నేను చూసిన అధ్భుతమైన ఫొటోల్లో ఇది ఒకటి’.. ‘సింప్లీ సూపర్బ్’.. ‘జస్ట్ అమేజింగ్’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.