calender_icon.png 28 January, 2026 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగానికి, ధిక్కారానికి ప్రతీకలు సమ్మక్క, సారలమ్మ

28-01-2026 12:16:02 AM

మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క, సార లమ్మ ప్రతీకలని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మేడారం జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కొంగు బంగారమై, కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు, కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర కుంభమే ళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుందని వెల్లడించారు.

తెలంగాణ ఆదివాసీ గిరిజన సమాజాల, సబ్బండ కులాల సంస్కతి సాంప్రదాయాలకు పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన పెద్దపీట వేసింద న్నారు. గోదావరి లోయ పరీవాహక ప్రగతితో సమాంతరంగా సాగిన ఆధ్యాత్మిక అభివృద్ధిని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని, సమ్మక్క సారలమ్మ దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.