09-09-2025 12:50:27 AM
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఆదిలాబాద్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయం జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఆలం రూప ఆధ్వర్యంలో 12వ వార్డ్ నుండి పలువు రు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీలో చేరావడం శుభ పరిణామమని అన్నారు.
అందరు కలిసికట్టుగా శ్రమించి పార్టీ విజయం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంతోష్ రావు, కొండ గంగాధర్, గుడిపెల్లి నగేష్, రమేష్, బండారి సతీష్, సంద నర్సింగ్, రామ్ కుమార్, జాఫర్ అహ్మద్, దర్శనాల ఏవన్, ఎం.ఏ షకీల్, తదితరులు పాల్గొన్నారు.