03-05-2025 09:45:07 PM
కోదాడ: కోదాడ పట్టణంలోని శనగల రాధాకృష్ణ ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ మోతే మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మోతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. కోట్ల రూపాయలతో నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకులకు సామూహిక స్థానం కల్పిస్తారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాసర్ల శ్రీనివాస్, బచ్చు అశోక్, జనార్దన్ రెడ్డి, పెండ్రాతీ కృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ షేక్ రహీం, మైనార్టీ డివిజన్ అధ్యక్షులు బాజాన్, రవి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.