calender_icon.png 2 November, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో మొదటి దారిద్య్ర రహిత రాష్ట్రం కేరళ

02-11-2025 01:10:45 AM

  1. అసెంబ్లీ వేదికగా సీఎం విజయన్ ప్రకటన
  2. దీర్ఘకాలిక ప్రణాళికలు సత్ఫలితాలు ఇచ్చాయని స్పష్టీకరణ

కేరళ, నవంబర్ 1: దేశంలోనే దారిద్య్ర రహిత రాష్ట్రంగా కేరళ సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించినట్టు తెలిపారు. శనివారం కేరళ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న సీఎం అసెంబ్లీ లో ప్రసంగించారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు 21,263 మందికి మొదటిసారిగా రేషన్ కార్డులు, ఆధార్, పెన్షన్లు వంటి ముఖ్యమైన పత్రాలు మంజూరు చేసిందని వెల్లడించారు.

అలాగే 4,394 కుటుంబాలకు జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా పని కల్పించామని తెలిపా రు. ప్రజలందరికీ సమాన హక్కులు నివాసం, విద్య, వైద్యం అందుతున్నట్లు తెలిపారు. దీనివల్ల కేరళ రాష్ట్రం అత్యంత దుర్భర పేదరికం నుంచి బయటపడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘తీవ్ర పేదరిక నిర్మూలన ప్రాజెక్టు‘ విజయవంతం కావడంతో ఈ ఫలి తం సాధ్యమైందన్నారు.

కాగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు మాత్రం కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన ప్రకటనపై విమర్శలు కురిపించాయి. ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించాయి. ప్రతిపక్ష నేత సతీశన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రక టన భారీ మోసం అని విమర్శించారు. ప్రభు త్వ ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.