07-11-2025 12:00:00 AM
బిగ్ టికెట్ ఈ డ్రాలో వరించిన పావుకిలో బంగారు
దుబాయ్, నవంబర్ 6: దుబాయ్‌లో ఓ ప్రవాస బారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. బిగ్ టికెట్ ఈ డ్రాలో పావుకిలో (25 తులాలు) బంగారాన్ని గెలుచుకున్నారు. కేరళకు చెందిన నితిన్ కున్నత్‌రాజ్ ఉపాధి రీత్యా 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయన తన స్నేహితులతో కలిసి కొన్న టికెట్ కు తాజాగా జాక్‌పాట్ తగిలింది. ఈ విషయాన్ని కున్నత్‌కు షో నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పగా మొదట ఆయన నమ్మలేదు.
తర్వాత టికెట్ నంబర్ 351853తో సహా చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఈ టికెట్‌పై ఆయన 24 క్యారెట్ల గోల్డ్ బార్ గల 250 గ్రాముల బంగారాన్ని గెలుచుకున్నారు. ఈ 25 తులాల పసిడి విలువ భారతదేశంలో దాదాపు రూ.30 లక్ష ల వరకు ఉంటుంది. వేర్వేరు పేర్ల మీద 10 మంది స్నేహితులతో కలిసి దీనిని కొన్నాని, వారితో ఈ మొత్తాన్ని పంచుకుంటానని కున్న త్ తెలిపారు. ఇలా ‘నాకు అదృష్టం వరించడం ఇదే తొలిసారి’అని సంతోషం వ్యక్తం చేశారు.