calender_icon.png 7 November, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలిన విమానాలు ఏడు కాదు.. ఎనిమిది!

07-11-2025 12:00:00 AM

-భారత్ మధ్య శాంతి ఒప్పందం నేనే కుదిర్చా

-అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  

న్యూఢిల్లీ, నవంబర్ 6:  అమెరికా అధ్యక్షు డు డోనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానంటూ పునరుద్ఘాటించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధాల సమయంలో కూల్చివేసిన జెట్ల సంఖ్యను మాత్రం ట్రంప్ మరోసారి సవరించారు.  మయామిలో జరిగిన బిజినెస్ ఫోరంలో ట్రం ప్ మాట్లాడుతూ తాను భారత్ పాక్ మధ్య మధ్య వర్తిత్వం వహించానని మరోమారు తెలిపారు.

‘నాడు నేను భారత్ వాణి జ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నానని.. ఇంతలో ఓ వార్తా పత్రికలో ఆ రెండు దేశాలు యుద్ధానికి దిగుతున్నారని ఆపరేషన్ సిందూర్‌లో ఏడు జెట్ విమానాలు తగులబడ్డాయి.. ఎనిమిదవది చాలా వరకు ధ్వంసం అయ్యింది. మొత్తం ఎనిమిది జెట్ విమనాలు కాలిపోయాయి. అవి రెండూ అణ్వాయుధ దేశాలు ‘మీరు శాంతికి అంగీకరిస్తే తప్ప నేను మీదో ఎటువంటి వాణిజ్యం ఒప్పందాలు చేసుకోను’ అని వారికి వివరించానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ మర్నాడే ఆ రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయని వివరించారు.