07-11-2025 12:00:00 AM
-వైరల్ అవుతాననుకోలేదు
-భారత రాజకీయాలతో నాకు సంబంధం లేదు
-బ్రెజిల్ మోడల్ లారిసా నెరీ
న్యూఢిల్లీ, నవంబర్ 6: ఇలా వైరల్ అవుతానని తాను అనుకోలేదని బ్రెజిల్‌కు చెందిన మోడల్ లారిసా నెరీ పేర్కొన్నారు. అది తన పాత ఫొటో అని తెలిపారు. హర్యానాలో భారీఎత్తున ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ ఎం పీ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై బ్రెజిల్‌కు చెందిన మోడల్ లారిసా నెరీ స్పందిం చారు. నకిలీ ఓటర్ల జాబితాలో ఉన్నది తన పాత ఫొటో అని, స్టాక్ ఇమేజ్ ప్లాట్‌ఫామ్ నుంచి కొని ఉంటారని, భారత రాజకీయాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
హర్యానాలో ఓట్ల చోరీ జరిగిందంటూ కాం గ్రెస్ ఎంపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడల్ ఫొటోతో నకిలీ ఓట్లు సృష్టించారంటూ రాహుల్ ఆరోపించారు. దీంతో ఆమె ఫొటో నెట్టింట వైరల్‌గా మారిం ది. ఆ ఫొటోలో ఉన్న మోడల్ పేరు లారిసా నెరీ. ఈ వార్తలపై ఆమె తాజాగా స్పందించా రు. అది తన పాత ఫొటో అని తెలిపారు. ఈ క్రమంలోనే లారిసా తన ఇన్‌స్టా పేజీలో దీనిపై స్పందించారు. ఓట్ల చోరీ వార్లల్లో తన పేరు రావడం చూసి చాలా షాకైనట్లు తెలిపా రు.
చాలామంది తనకు ఫోన్లు చేస్తున్నారని ఇంటర్వ్యూలు కావాలంటున్నారు. ఇలా వైరల్ అవుతానని అనుకోలేదన్నారు. అది నా పాత ఫొటో.18 ఏళ్ల వయసులో తీసుకున్నది అనుకుంటా. స్టాక్ ఇమేజ్ ప్లాట్‌పామ్ నుంచి ఆ ఫొటోను కొనుగోలు చేసి ఉంటారనుకుం టా. నన్ను భారతీయురాలిగా పేర్కొంటూ స్కామ్‌లో భాగం చేశారు.భారతదేశంలో రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ఫొటోను స్టాక్ ఇమేజ్ ప్లాట్‌పామ్ నుంచి కొనుగోలు చేసి, నా ప్రమేయం లేకుండా ఉపయోగించారు. అది నేను కాదు, నేను ఎప్పుడూ భారతదేశానికి కూడా వెళ్లలేదు‘ అని ఆమె ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు, ‘నేను బ్రెజిలియన్ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని హెయిర్ డ్రెస్సర్‌ని అని తెలిపారు.