calender_icon.png 27 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేవల్ కిషన్ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి

27-12-2025 01:34:45 AM

నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, డిసెంబర్ 26: పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  నీలం మధు అన్నారు. శుక్రవారం కేవల్ కిషన్ వర్ధంతి సందర్భంగా చిట్కుల్ ఎన్‌ఎంఆర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు, మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో స్వర్గీయ కేవల్ కిషన్ ముదిరాజ్ స్మారకర్తము నిర్మించిన సమాధి వద్ద ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున నిర్వహించే జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది అని నీలం మధు అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు కేవల్ కిషన్ అన్నారు.  మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఒక్కటి చేసి ప్రజాపోరాటాలు నిర్వహించారని తెలిపారు.దున్నేవాడికే భూమి అంటు భూ పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిపెట్టారని కొనియాడారు.అలాగే కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి హక్కుల సాధనకు కృషి చేశాడన్నారు.

అలాంటి మహనీయున్ని ప్రజలు స్మరించుకుంటు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి చుట్టూ ఎడ్లబండ్లను తిప్పుతూ జాతరను చేయడం ప్రశంసనీయమని తెలిపారు. ప్రజల కోసం జీవించి ప్రాణాలర్పించిన మహనీయులని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని కొలుస్తారనడానికి నిదర్శనమే కెవల్ కిషన్ పోరాటం అన్నారు. అలాంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచులు మణిదీప్, దానంపల్లి సుజాతసత్యం, గీతనరేందర్, కృష్ణ, నాయకులు శ్రీనివాస్,మహేష్, గణేష్, ప్రవీణ్, రంజిత్, తధితరులు పాల్గొన్నారు.