calender_icon.png 12 July, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం

11-07-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి జూలై 10 ( విజయ క్రాంతి ): ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా రైతులకు అధిక ఆదాయం  వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్  జంగా రాఘవ రెడ్డి అన్నారు. గురువారం రోజు ఆలేరు మండలం లో కొలనుపాక గ్రామం లో రైతు నర్రా నారాయణ రెడ్డి, సీతా రాం రెడ్డి, వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమానికి  ప్రభుత్వ  విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల  ఐ లయ్య,   యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ  జిల్లా లో ఆయిల్ ఫామ్ తోటల సాగును పెంచాలని, రైతులకు ఖర్చు తగ్గించే పంట ఆయిల్ ఫామ్,ఆయిల్ ఫామ్ తోటల సాగుకు మెండుగా అవకాశాలువున్నాయని,పంట మార్పిడి రైతులకు అధిక ఆదాయాన్ని ఇస్తుందని అన్నారు.ఆయిల్ పామ్ పంట యొక్క అవశ్యకత గురించి వాటి లాభాలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల గురించి మరియు తోటల యాజమాన్య పద్ధతులు ఐన (ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం, అంతర పంటలు & అంతరకృషి చర్యలు, గురించి క్లుప్తంగా రైతులకు వివరించడం జరిగింది.

సూక్ష్మ సేద్య పరికరాలను రాయితీపై SC,ST రైతులకు 100%,BC రైతులకు 90%,OC రైతులకు 80%, ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. ఈ పంట సాగుతో రైతుకు ఎకరాకు 1.5 నుండి 2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ పంట సాగులో చీడపీడల సమస్య, కోతుల బెడద, ప్రకృతి వైపరీత్యాల సమస్య ఉండదు అన్నారు.ముందుగా గుర్తించిన ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఫలితాలు సాధించాలన్నారు.

ప్రభుత్వాలు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లా డుతూ జిల్లా లో రైతుల ముందుకు రావాలన్నారు.పంట మార్పిడి విధానం రైతులకు లాభం చేకూరుస్తుందని రైతులకు తెలియజేయాలన్నారు. సంప్రదాయ పంటలే కాకుండా ఇతర పంటలను కూడా రైతులకు పండించే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ బాబు, ఓ ఎస్ డి కిరణ్, ఆయిల్ ఫెడ్ స్పెషల్ ఆఫీసర్  తిరుమలేష్ రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి సుభాషిణి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్

దేవరకొండ, జూలై 10 : ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సహకారంతో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ నల్లగొండ ఆధ్వర్యంలో నాయిని జమున - మాధవ రెడ్డి, సుభాష్ రెడ్డి ల 16.2 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో, మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా ‘ఆయిల్ పామ్’ మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా, మూడు రెట్లు అధిక దిగుబడి, ఆదాయాన్ని అందించే సులభతరమైన బహువార్షిక వాణిజ్య పంట అయినటువంటి ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని సూచించారు.

ఆయిల్ పామ్ మొక్కను ఒకసారి నాటితే 4 వ సంవత్సరం నుండి నిర్విరామంగా 30 సంవత్సరాల వరకు సరాసరిన ఎకరానికి 10 నుండి 12 టన్నుల దిగుబడిని తీసుకోవచ్చు మరియు ఎకరానికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు అలాగే ఈ పంటకు జంతువుల నుండి గానీ, దొంగల నుండి గానీ ఎటువంటి బెడద ఉండదు. ఆయిల్ పామ్ వేసిన రైతు ఈ పంట నుండి ప్రతి నెల ఆదాయాన్ని తీసుకొనే సౌకర్యం కలదు.

ఈ కార్యక్రమంలో పతంజలి కంపెనీ ఏజీఎం రామకృష్ణయ్య, కొండమల్లేపల్లి మార్కెట్ చైర్మన్ జమునా - మాధవ రెడ్డి, దేవరకొండ ఉద్యాన అధికారి రవినాయక్, నిడమనూర్ ఉద్యాన అధికారి రిషిత, కొండమల్లేపల్లి మాజీ ఎంపీపీ రేఖ శ్రీధర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఊట్కూరి వేమన్ రెడ్డి, గుడిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లేపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సర్వయ్య, పతంజలి కంపెనీ ప్రతినిధులు, 150 మంది ప్రగతిశీల రైతులు పాల్గొన్నారు.