30-01-2026 01:24:18 AM
హనుమకొండ, జనవరి 29 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలోని పరకాల పుర పాలక ఎన్నికల సాధారణ పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి కిల్లు శి వకుమార్ నాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన ఎన్నికల పరిశీలకులు కిల్లు శివకుమార్ నాయుడుకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మొక్కను అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో జిల్లా ఎన్నికల పరిశీలకులు కిల్లు శివకుమార్ నాయు డు సమావేశమై పరకాల పురపాలక సంస్థకు సంబంధించిన అంశాలను గురించి ఈ సం దర్భంగా చర్చించారు. శివకుమార్ నాయు డు గతంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు హానుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశారు.