calender_icon.png 30 January, 2026 | 6:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన జాతర

30-01-2026 01:22:48 AM

కిక్కిరిసిన ముల్కనూరు సమ్మక్క ప్రాంగణం

సమ్మక్క రాక.. పోలీస్ శాఖ గాల్లోకి కాల్పులు

భీమదేవరపల్లి, జనవరి 29 (విజయక్రాంతి): సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తు లు పోటెత్తారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో  44 సంవత్సరాలుగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు తరలి వచ్చి నిలువె త్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు.  మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం మంత్రి  మాట్లాడుతూ.. ముల్కనూర్ సమ్మ క్క వద్ద రెండు లక్షలతో సీసీ పనులు పూర్తి అయ్యాయని, మరో తొమ్మిది లక్షలతో జాత ర వద్ద పైపు పైపులైన్ నిర్మాణం పనులు మరుగుదొడ్ల నిమిత్తం ఖర్చు చేసి జాతరను అభివృద్ధి చేస్తామన్నారు.

గురువారం రాత్రి సమ్మక్క రాక సందర్భంగా గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపా రు . భారీ భక్తజనం మధ్య సమ్మక్క గురువా రం రాత్రి గద్దె కు చేరుకుంది. అనంతరం మంత్రికి  కొత్తకొండ ఆలయ ఈవో కిషన్ రావు, సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి సమ్మక్క సారలమ్మ ఫోటోను బహుకరించారు. జాతరలో వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సు రేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ము ల్కనూర్ పి హెచ్ సి నుంచి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించారు. జాతర ఉత్సవాల్లో భ క్తులకు ఎంపీడీవో వీరేశం ఈవో జంగం పూ ర్ణచందర్ ఆధ్వర్యంలో మండలంలోని 25 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు విస్తృత సేవలు అందించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి ఆధ్వ ర్యంలో సీఐ పులి రమేష్, ఎస్‌ఐలు ఎం రా జు, దివ్య, ప్రవీణ్ కుమార్ తో పాటు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.