calender_icon.png 29 January, 2026 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో రూ. 28 లక్షల విలువ చేసే 50.4కిలోల ఎండు గంజాయి పట్టివేత

29-01-2026 12:11:12 AM

ఒరిస్సా నుండి భద్రాచలం మీదిగా గంజాయి కేరళ తరలిస్తున్న ముగ్గురు నిందితులు

భద్రాచలం, జనవరి 28, (విజయక్రాంతి): భద్రాచలం సరిహద్దున గల ఇసుక ర్యాంపు సమీపంలో బుధవారం ఉదయం 10 సమయంలో ఒరిస్సా నుండి కారులో అక్రమంగా భద్రాచలం మీదుగా తరలిస్తున్న 54 కేజీల ఎండు గంజాయిని ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు.  ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం  ఆజ్ఞానుసారం  స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఉమ్మడి  ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్  ఆదేశాల మేరకు  ఎన్ఫోర్స్మెంట్  ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి  ఆధ్వర్యం లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ హరిరావు సిబ్బంది కలిసి భద్రాచలం - నెల్లిపాక రోడ్డు లో తనిఖీలు నిర్వహిస్తుండగా భద్రాచలం ఇసుక రీచ్ సమీపం లో అనుమానాస్పదంగా కనిపించిన  కారు ను ఆపి తనిఖీ చేయగా దాని లో మొత్తం 50.4  కేజీల ఎండు గంజాయి లభ్యమైంది.

ఈ సందర్భంగా చేపట్టిన విచారణ లో గంజాయి ని తిరువనంతపురం (కేరళ)కి చెందిన  అక్షయ్ సురేష్ , కుంజుమాన్  సురేంద్రన్ మినిమోల్,  అనంత కృష్ణన్  లు ఒడిశా రాష్టం లోని మల్కాన్ గిరి నుండి  తిరువనంతపురం (కేరళ) కు తరలిరిస్తు పట్టుబడినారు . ముగ్గురు ముద్దాయిలను , 4 సెల్ ఫోన్లను రూ  17 వేల నగదును సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ   రూ 28 .70 లక్షలు  ఉంటుందని తెలిపారు.

పట్టుబడిన గంజాయిని, నిందితులను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు. ఇట్టి తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ యం.ఏ.కరీం, కానిస్టేబుల్స్ సుధీర్,వెంకట్, హనుమంతరావు, వీరబాబు , ఉపేందర్ లు పాల్గొన్నారు. ఏదైనా గంజాయి కి సంబంధించిన సమాచారం ఉన్నచో టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు సమాచారం అందించగలరని, మీ వివరాలు గోప్యం గా ఉంచబడతాయి అని ఎక్సైజ్ సూపర్డెంట్  తిరుపతి  తెలియజేశారు .