26-01-2026 02:43:12 AM
రంగారెడ్డి, జనవరి 2౫( విజయక్రాంతి): పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యంతో జానపద కళకు ప్రాణం పోసిన పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగులయ్య కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ప్రతినిధులు మొగులయ్య ను ’గౌరవ డాక్టరేట్’కు ఎంపిక చేశారు. అంతరించిపోతున్న కిన్నెర కళను బ్రతికిస్తున్నందుకు గాను ఈ డాక్టరేట్ ప్రకటించారు.
ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మాన్ ఘాట్ తన కార్యాలయంలోయూనివర్సిటీ నామినేషన్ కమిటీ సభ్యులు డా. గౌని నర్సింహ గౌడ్, జాయింట్ డైరెక్టర్ డా. అరిఫుద్దీన్ అవార్డు ప్రక్రియను పూర్తి చేసి పత్రాలను చెన్నైకి పంపారు. వచ్చేనెల ఫిబ్రవరి 14, 2026న చెన్నైలోని భారతీయ విద్యా భవన్ వేదికగా ఈ అవార్డును అధికారికంగా ఆయనకు ప్రదానం చేయనున్నారు. మొగులయ్య అవార్డు కు ఎంపిక చేసినచేయడం తో రంగారెడ్డి జిల్లా డీసీసీ వైస్ ప్రేసిడెంట్, సామాజికవేత్త వై. వెంకటేశ్వర్లు గౌడ్,నాయకులు వెంకట్ రెడ్డి లు ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
గతంలోనే కిన్నెర మొగిలయ్య ను తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఆయన కళా వైదుష్యాన్ని ప్రశంసించిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్ సినిమాలోని పాటతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మొగులయ్య కు ఇప్పుడు డాక్టరేట్ రావడం తెలుగు జానపద కళకు దక్కిన గౌరవం.